
త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానన్నారు సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. సంగారెడ్డి నుండి ఆదిలాబాద్ వరకు పాదయాత్ర చేస్తానన్నారు. త్వరలోనే పాదయాత్ర వివరాలు వెల్లడిస్తానన్నారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ప్రజలు అల్లాడిపోతున్నారన్నారు. కేసీఆర్ మాట విని సన్నవడ్లు పండించిన రైతులు అదోగతి పాలయ్యారన్నారు. రైతుల పక్షాన నిలబడుతూ పాదయాత్ర చేస్తానన్నారు. ప్రతీ రైతును కలిసి వారి సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రస్తావిస్తానన్నారు.