జగిత్యాల: కొడుకుకు అరుదైన వ్యాధి.. భార్య వరకట్న వేధింపుల కేసు

జగిత్యాల: కొడుకుకు అరుదైన వ్యాధి.. భార్య వరకట్న వేధింపుల కేసు
  • న్యాయం చేయాలని ప్రజావాణిలో కలెక్టర్‌‌‌‌‌‌‌‌కు వినతి 

జగిత్యాల, వెలుగు: దివ్యాంగుడైన కొడుకు కోసం ఓ తండ్రి కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ త్యాగం చేయగా.. తోడుగా ఉండాల్సిన భార్య.. అతడిపై వరకట్నం వేధింపులు కేసు పెట్టింది. దీంతో ఓ వైపు కొడుకుకు వచ్చిన జబ్బుతో.. భార్య పెట్టిన కేసుతో అతడు అవస్థలు పడుతున్నాడు. సోమవారం తనకు న్యాయం చేయాలంటూ ప్రజావాణిలో కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వేడుకున్నాడు. బాధితుడి వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం గంభీరావుపేటకు చెందిన సురేశ్‌‌‌‌‌‌‌‌కు ఆరేండ్ల కింద రమ్యతో వివాహమైంది. వారికి 4 ఏండ్ల కొడుకు శివన్ష్ ఉన్నాడు. అతడు అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నాడు. 

దీంతో పుట్టినప్పటి నుంచి ఎదుగుదల లేదు. కొడుకు పరిస్థితి చూసి సురేశ్‌‌‌‌‌‌‌‌ తన సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్ ఉద్యోగాన్నే వదిలి హాస్పిటళ్ల చుట్టూ తిప్పుతున్నాడు. ఇలాంటి సమయంలో రెండేళ్ల కింద భార్య.. వారిని వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. అంతటితో ఆగకుండా భర్తపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. ఒకవైపు అనారోగ్యంతో ఉన్న కొడుకు.. మరో చేతిలో కోర్టు నోటీసులతో తట్టుకోలేకపోతున్నానని సురేశ్ ఆవేదన వ్యక్తం చేశాడు. భార్య తనపై పెట్టిన తప్పుడు కేసులను లోక్ అదాలత్‌‌‌‌‌‌‌‌లో కొట్టివేయాలని కోరుతూ సురేశ్‌‌‌‌‌‌‌‌.. కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రజావాణిలో వినతిపత్రం అందజేశాడు.