సిరిసిల్ల చేనేత: అగ్గిపెట్టెలో పట్టుచీర..బెజవాడ అమ్మవారికి బహుకరణ

సిరిసిల్ల చేనేత:  అగ్గిపెట్టెలో పట్టుచీర..బెజవాడ అమ్మవారికి బహుకరణ

తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ చేనేత కళాకారుడు...చేనేత కళా రత్న... అవార్డు గ్రహీత  నల్ల విజయ్ కుమార్ జూన్​ 16 మంగళవారం  ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానాన్ని సందర్శించారు. తన తండ్రి, ప్రముఖ చేనేత శిల్పి అవార్డు గ్రహీత స్వర్గీయ నల్ల పరంధాములు గారి స్ఫూర్తితో, వారి అడుగుజాడల్లో నడుస్తూ తాను ప్రత్యేకంగా నేసిన అత్యంత విలక్షణమైన పట్టుచీరను శ్రీ కనకదుర్గ అమ్మవారికి అలంకరణ చేయవలసినదిగా ఆలయ ఈవో వికె శీనా నాయక్ కు అందజేశారు.

​‘అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీర’ ప్రత్యేకతలు ఇవే..

​చేనేత రంగానికే మచ్చుతునకగా నిలిచిన ఈ పట్టుచీరను విజయ్ కుమార్ వారం రోజుల పాటు రాత్రింబవళ్లు శ్రమించి మగ్గంపై అద్భుతంగా మలిచారు.

  • పరిమాణం & బరువు: ఈ అద్భుత పట్టుచీర పొడవు 5.5 మీటర్లు (ఐదున్నర మీటర్లు), వెడల్పు 48 ఇంచులు ఉంటుంది. ఇంత పెద్ద పరిమాణం ఉన్నప్పటికీ, దీని బరువు కేవలం 200 గ్రాములు మాత్రమే కావడం విశేషం.​ఈ పట్టుచీరను సాంప్రదాయ, ఆకర్షణీయమైన ‘ఇక్కత్ డిజైన్’ వచ్చేలా అత్యంత నైపుణ్యంతో రూపొందించారు.​ఈ చీరను మడతపెడితే సులభంగా ఒక చిన్న అగ్గిపెట్టెలో ఇమిడిపోతుంది.

 చేనేత కళాకారుడు  నల్ల విజయ్ కుమార్ మాట్లాడుతూ..గతంలో తాను తయారు చేసిన ప్రతి సరికొత్త చేనేత సృష్టికి ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆశీస్సులు లభించాయన్నారు. ఎల్లప్పుడూ దుర్గమ్మ తల్లి దీవెనలు మాపై ఉండాలని కోరుకుంటూ ఈ సరికొత్త పట్టుచీరను సమర్పించి, అమ్మవారి కృపకు పాత్రులం కావడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.

 గతంలో.. ఆపరేషన్ సింధు...  పేరిట అద్భుతమైన శాలువను తయారు చేసి పీఎం మోదీకి ఇచ్చి ప్రశంశలు అందుకున్నట్లు తెలిపారు.  అదే స్ఫూర్తితో చేనేత కళా నైపుణ్యాన్ని చాటుతూ  ఇంద్రకీలాద్రి అమ్మవారికి ఈ చీరను  తయారు చేశామన్నారు.

​అమ్మవారికి సమర్పించిన ఈ అద్భుతమైన చేనేత కళాఖండాన్ని ఆలయఈవో శీనానాయక్ పరిశీలించి,అసాధారణ ప్రతిభ చూపిన చేనేత కళాకారుణ్ణి ప్రశంసించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహిస్తున్న రీతిగా మన సంప్రదాయకళలను ప్రతి ఒక్కరూ ఆదరించాలని శీనానాయక్ కోరారు.