ఇల్లిచ్చిన సారూ.. ఎల్లిపోతున్నవా!

ఇల్లిచ్చిన సారూ.. ఎల్లిపోతున్నవా!

జగిత్యాల కలెక్టర్ శరత్ ట్రాన్స్ ఫర్ అయితున్నడని తెలిసి అక్కడి ఉద్యోగులు, ప్రజలు కంటతడి పెట్టుకున్నారు. ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించిన శరత్ మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో తనకు డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించిన కలెక్టర్ బదిలీపై వెళ్తున్నాడని తెలుసుకున్న రాయికల్ మండలం ఇటిక్యాలకు చెందిన భూక్య లక్ష్మీ సోమవారం ఆయనను కలిసింది. శాలువాతో సత్కరించి ‘సారూ.. మీ మేలు మరువను” అంటూ కంటతడి పెట్టుకుంది.                                                                                      – జగిత్యాల, వెలుగు