ముస్లింల ఓట్లు కాంగ్రెస్​కే .. ముస్లిం ఐక్యవేదిక జాగో ముసల్మాన్ కమిటీ  

ముస్లింల ఓట్లు కాంగ్రెస్​కే .. ముస్లిం ఐక్యవేదిక జాగో ముసల్మాన్ కమిటీ  

హైదరాబాద్, వెలుగు :  ఈసారి ఎన్నికల్లో రాష్ట్రంలోని ముస్లింలంతా కాంగ్రెస్​కే ఓటేయాలని గట్టి నిర్ణయంతో ఉన్నారని తెలంగాణ ముస్లిం ఐక్యవేదిక జాగో ముసల్మాన్ కమిటీ తెలిపింది. గురువారం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కమిటీ గౌరవ అధ్యక్షుడు బ్రదర్ సిరాజుల్ రెహ్మాన్, మహిళా విభాగం అధ్యక్షురాలు షమీమ్ సుల్తానా తదితరులు కలిసి మద్దతు ప్రకటించారు. ముస్లింల పోలింగ్ శాతం 30–40 కంటే ఎక్కువగా ఉండదని, ఈసారి 70 – 75 శాతానికి పెంచేలా జాగో ముసల్మాన్ కమిటీ ప్రయత్నిస్తోందన్నారు.

అన్ని జిల్లాల్లో ముస్లిం డిక్లరేషన్ పేరుతో సమావేశాలు నిర్వహిస్తూ బీఆర్ఎస్​కు వ్యతిరేకంగా ఓటు వేయాలని చైతన్యం చేస్తున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ మైనార్టీ సెల్ సభ్యులంతా కలిసి ఈ ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. తమ కాన్సెప్ట్ ద్వారా ఒక్కో సెగ్మెంట్​లో 25 వేల ఓట్లు అదనంగా పోల్ అవుతాయని, అవి కాంగ్రెస్​కే పడతాయన్నారు.