
జూబ్లీహిల్స్, వెలుగు: ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడంతో జాగృతి కార్యకర్తలు, అభిమానులు మంగళవారం నిరసన తెలిపారు. బంజారాహిల్స్‌లోని జాగృతి ఆఫీస్ ముందు ఎమ్మెల్యే హరీశ్ రావు, సంతోష్‌రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇద్దరి దిష్టిబొమ్మలను ఊరేగించి జాగృతి కార్యాలయం ముందు దహనం చేశారు. కవితను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.