షూటింగ్ స్పాట్గా మారిన జగిత్యాల కొత్త కలెక్టరేట్

షూటింగ్ స్పాట్గా మారిన జగిత్యాల కొత్త కలెక్టరేట్

జగిత్యాల జిల్లా కొత్త కలెక్టరేట్ షూటింగ్ స్పాట్ గా మారింది. కలెక్టరేట్ నిర్మించి రెండేళ్లు గడుస్తున్నా ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో కొత్త కలెక్టరేట్ భవనం ఫోటో షూట్స్ కు అడ్డాగా మారుతోంది. రోజు కలెక్టరేట్ భవనం ముందు యువత కెమెరాలతో ఫోటోలకు ఫోజులిస్తూ... బైక్స్ తో రైడింగ్ చేస్తున్నారు. 

దీనికి తోడు మరికొందరు కలెక్టరేట్ భవనం ముందు ఫ్రీ వెడ్డింగ్ షూట్స్ నిర్వహిస్తున్నారు. డ్రోన్స్, 4K లాంటి కెమెరాలతో వీడియోలు తీస్తూ ఆల్బమ్స్ చేసుకుంటున్నారు. అయితే కలెక్టరేట్ నిర్మాణం పూర్తయి రెండు ఏళ్లు గడుస్తున్నా... ప్రారంభించకపోవటంతో పర్యాటక కేంద్రంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.