
జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామంలోని హైస్కూల్‌లో టాయిలెట్లు ఉన్నా వినియోగించకపోవడంతో ఆరుబయటకు వెళ్లాల్సిన పరిస్థితి. ఈ స్కూల్‌లో 33 మంది బాయ్స్, 36 మంది గర్ల్స్ఉన్నారు. టాయిలెట్ల నిర్మాణం పూర్తయినప్పటికీ వాటర్ ట్యాంక్‌కు నీటి కనెక్షన్ ఇవ్వకపోవడంతో వాటిని వినియోగించే వీలు లేకుండా పోయింది. తాత్కాలికంగా డ్రమ్ములు ఏర్పాటు చేయడంతో గర్ల్స్ టాయిలెట్స్ వినియోగించుకుంటున్నారు.
బాయ్స్ టాయిలెట్లకు తాళం వేయడంతో బయటకు వెళ్తున్నారు. స్కూల్ ఆవరణలో బోర్ ఉన్నా అది సరిగా పని చేయకపోవడంతో నీటికి అవస్థలు పడుతున్నారు. అదే ప్రాంగణంలో ఉన్న ప్రైమరీ స్కూల్‌లోనూ టాయిలెట్లు నిర్మించినా, బిల్లులు రాలేదని కాంట్రాక్టర్ తాళం వేశాడు. -జగిత్యాల రూరల్, వెలుగు