Video Viral: బ్రిటన్​ పార్లమెంట్ లో జై శ్రీరాం నినాదాలు

Video Viral: బ్రిటన్​ పార్లమెంట్ లో జై శ్రీరాం నినాదాలు

యూకే  పార్లమెంట్​ జైశ్రీరాం నినాదాలతో దద్దరిల్లింది. రామ జన్మభూమి  అయోధ్యలో బలరాముడి విగ్రహాన్ని  భారత ప్రభుత్వం ప్రతిష్ఠిస్తున్నందుకు UK పార్లమెంట్​లో సనాతన్ సంస్థ ఆఫ్ UK (ఎస్‌ఎస్‌యుకె) శ్రీరాముని వేడుకలు నిర్వహించి... అక్కడి ధార్మిక సంఘాలు డిక్లరేషన్​పై సంతకం చేసిన ప్రకటనను భారత ప్రభుత్వానికి అందజేశారు. 

అయోధ్యలో బలరాముడి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం కోసం భారత దేశమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా భక్తులు ఎదురుచూస్తున్నారు.  ఇప్పటికే అయోధ్యలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు చేయాల్సిన క్రతువును పండితులు ప్రారంభించారు.  ప్రపంచ వ్యాప్తంగా జైశ్రీరాం నినాదాలు మారుమ్రోగుతున్నాయి.  ఇదిలా ఉండగా లండన్​ లోని బ్రిటన్​(UK) పార్లమెంట్​లో ఘనంగా శ్రీరాముడి వేడుకలు నిర్వహించారు.  బ్రిటన్ పార్లమెంట్‌లో సనాతన్ సంస్థ ఆఫ్ UK (ఎస్‌ఎస్‌యుకె) రామమందిర వేడుకలను ప్రారంభించింది. శంఖం ఊదుతూ జై శ్రీరాం అంటూ నినాదాలు చేసిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అయింది. 

బ్రిటన్​ పార్లమెంట్​ హౌస్​ లో  జరిగిన శ్రీరాముని వేడుకలను యుగ్పురుష్ ప్రారంభించారు.  శ్రీరాముడి కీర్తనలను ఆలపిస్తూ భజనలు చేశారు. ఈ కార్యక్రమంలో  SSUK సభ్యులు కక్భూషుండి సంవాద్ ను ప్రదర్శించారు. భగవద్గీత లోని 12 వ అధ్యాయాన్ని వివరిస్తూ శ్రీకృష్ణుని గురించి వివరించారు.  హారో ఎంపీ బాబ్ బ్లాక్‌మాన్, రాజ్ రాజేశ్వర్ గురు జీ,  స్వామి సూర్య ప్రభ దీదీలతో కలిసి బ్రహ్మర్షి ఆశ్రమం, హన్స్‌లో, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. 

UK ప్రకటనపై  గురువారం ( జనవరి 18) 200 దేవాలయాలు సంతకం చేశాయి.  కమ్యూనిటీ సంస్థలు, ఆధ్యాత్మిక  సంఘాలు సంతకం చేసిన UK డిక్లరేషన్‌ను ప్రాణ్ ప్రతిష్ఠా వేడుకకు ముందు అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు  బ్రిటన్​ పార్లమెంట్​ అందించనుంది. UKలోని ధార్మిక సంఘాల నుండి వచ్చిన  ప్రకటన అయోధ్యలో రామజన్మభూమి మందిర ప్రారంభోత్సవ వేడుకలో ప్రదర్శించనున్నారు. 

జనవరి 22న అయోధ్యలో రామమందిరంలో రాముడి విగ్రహాన్ని  ప్రతిష్ఠిస్తున్నందుకు  UKలోని ధార్మిక సంఘాలు  పట్ల హర్షం వ్యక్తం చేశాయి..ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు నేతలు హాజరుకానున్నారు. ఈ వేడుకకు పలువురు ప్రముఖులు, ప్రముఖులను కూడా ఆహ్వానించారు.