
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ "ఆదిపురుష్".రామాయణ గాధ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి జై శ్రీరామ్ ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. బాలీవుడ్ సంగీత ద్వయం అజయ్-అతుల్ స్వరపరిచిన ఈ పాట అద్భుతంగా ఉంది. విజువల్స్ తో పాటు సాంగ్ వింటుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి.
ఇక శ్రీరాముడిగా ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ అయితే నెక్స్ట్ లెవల్. పాట ప్రారంభంలో "ఎవరు ఎదురురాగలరు మీ దారికి, ఎవరికుంది ఆ అధికారం..." అంటూ ప్రభాస్ చేసిన డైలాగ్స్ ఐతే పీక్స్ లో ఉన్నాయి. ఇక సినిమా నుండి విడుదలవుతున్న ఒక్కో అప్డేట్ ప్రేక్షకులలో ఆతృతను పెంచేస్తోంది. ఎప్పుడెప్పుడు సినిమా విడుదలవుతుందా అంటూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్.
బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనుండగా.. కృతి సనన్ సీతగా నటిస్తోంది. మరి ఈ సినిమా విడుదల తరువాత ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేయనుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.