జైలర్ సినిమాకి రజినీ రికార్డ్ రెమ్యునరేషన్.. మరో రూ.100 కోట్ల చెక్ ఇచ్చిన నిర్మాత

జైలర్ సినిమాకి రజినీ రికార్డ్ రెమ్యునరేషన్.. మరో రూ.100 కోట్ల చెక్ ఇచ్చిన నిర్మాత

సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanath) కు జైలర్(Jailer) మూవీతో చాలా రోజుల తర్వాత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పడింది. నెల్సన్ దిలీప్ కుమార్(Nelson dileep kumar) తెరకెక్కించిన ఈ డార్క్ కామెడీ అండ్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో జైలర్ మూవీ విడుదలైన నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసి.. నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది.

ఇక మొత్తంగా ఈ సినిమా విడుదలైన మూడు వారాలకు గాను రూ.620 కోట్లకు పైగా గ్రాస్.. రూ.280 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.  దీంతో నిర్మాతలకు సుమారు రూ. 150 కోట్లకు పైగా లాభాలు వచ్చాయి. అయితే.. జైలర్ సినిమాకు ఊహించని లాభాలు రావడంతో.. సూపర్ స్టార్ రజనీకాంత్ కు ముందుగా ఇచ్చిన రెమ్యునరేషన్ కాకుండా మరో చెక్కును అందించారు కి నిర్మాత కళానిధి మారన్. 

కోలీవుడ్ వర్గాల నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. జైలర్ సినిమాకు రజనీకాంత్ దాదాపు రూ.100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ గా తీసుకున్నారు. ఇప్పులు చెక్కు రూపంలో మరో వంద కోట్లు అందుకున్నాడు రజనీకాంత్. దీంతో రజని జైలర్ సినిమాకు గాను మొత్తంగా రూ.200 కోట్లు అందుకున్నారు. అందుకే.. చెక్ పై ‘ది రియల్ రికార్డు మేకర్’ అని రాయించారు నిర్మాత. ప్రస్తుతం రజనీకాంత్ రెమ్యునరేషన్ విషయం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.