జైషే మహ్మద్‌‌‌‌‌‌‌‌ హెడ్ క్వార్టర్స్ ఇదే

జైషే మహ్మద్‌‌‌‌‌‌‌‌ హెడ్ క్వార్టర్స్ ఇదే

‘మర్కజ్ సుభానల్లా’ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌‌‌‌‌‌‌‌ హెడ్ క్వార్టర్స్. పాకిస్థాన్‌‌‌‌‌‌‌‌లోని బహావల్ పూర్ లో మూడు ఎకరాల మైదానంలో ఉన్న ఈ భవనం సకల సౌకర్యాలకు నిలయం. దాదాపు 600 మంది టెర్రరిస్టులు ఇక్కడే ట్రైనింగ్ తీసుకుంటున్నారు. మూడంతస్తుల ఈ భారీ భవనాన్ని కట్టేందుకు జైషే చీఫ్ మసూద్ అజర్‌‌‌‌‌‌‌‌కు మూడేళ్లు పట్టింది. స్విమ్మింగ్ పూల్, జిమ్ తదితర అత్యాధునిక వసతులతో దీన్ని కట్టారు . జైషేలో చేరిన ఏ టెర్రరిస్టుకైనా ముందు బహావల్‌‌‌‌‌‌‌‌పూర్ లోని హెడ్ క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో ట్రైనింగ్ ఇస్తారు. ఆ తర్వాత బాలాకోట్ లోని ట్రైనింగ్ సెంటర్‌‌‌‌‌‌‌‌కు పంపుతారు. మసూద్ అజర్, అతని సోదరులు, ముఖ్య అనుచరులు మర్కజ్ సుభానల్లాలోనే ఉంటారు.

రిపోర్టుల ప్రకారం మర్కజ్ సుభానల్లాను కట్టుకునేందుకు పాకిస్థాన్ ప్రొవిన్షియల్, ఫెడరల్ గవర్నమెంట్ మసూద్‌‌‌‌‌‌‌‌కు సాయం చేశాయి. పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ హయాంలో 2012 నుంచి 2015 మధ్య ఈ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌ను కట్టారు. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, యూకేల్లోని సానుభూతిపరుల నుంచి భవనం కోసం మసూద్ కొంత డబ్బును కూడగట్టాడు. ప్రతి శుక్రవారం మసూద్ సోదరుడు ముఫ్తీ అబ్దుల్ రావుఫ్ అస్గర్ లేదా మరో సీనియర్ టెర్రరిస్ట్ యూత్‌‌‌‌‌‌‌‌కు జిహాద్‌‌‌‌‌‌‌‌పై ఉపన్యాసాలిస్తారు.