ఒకపక్క శాంతి చర్చలు మరోపక్క దాడులు ఇరాన్ అమెరికా మధ్య కొనసాగుతున్న పరిస్థితి ఇది. దీంతో గ్లోబల్ బులియన్ మార్కెట్లు పూర్తిగా ఆస్తవ్యస్థంగా కొనసాగుతున్నాయి. గడచిన రెండు వారాలుగా భారీగా తగ్గిన బంగారం రేట్లు శుక్రవారం నుంచి రివర్స్ గేర్ తీసుకున్నాయి. దీంతో శుక్ర, శని వారాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర ఏకంగా రూ.3వేల 440 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో వీకెండ్ ఇంకా రేట్లు తగ్గుతాయ్ షాపింగ్ చేద్దాం అనుకుంటున్న తెలుగు ఫ్యామిలీస్ షాకయ్యాయి. ఈ క్రమంలో ఆభరణాలు కొనాలనుకుంటున్న తెలుగు ప్రజలు ముందుగా తమ నగరాల్లోని మారిన రేట్లను పరిశీలించటం బెటర్.
జూన్ 13న బంగారం రేట్లు పెరిగాయి. జూన్ 12 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.50 పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 908గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 665గా కొనసాగుతోంది.
శనివారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. జూన్ 13, 2026న దేశవ్యాప్తంగా మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతోంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.2లక్షల 70వేలుగా ఉంది. అంటే గ్రాము దాదాపు రూ.270 దగ్గర ఉంది.
