ఇక వీరు మారరా.. మసూద్​కు పాక్14 కోట్ల పరిహారం..జైషే చీఫ్​కు అందించనున్న పాక్​

ఇక వీరు మారరా.. మసూద్​కు పాక్14 కోట్ల పరిహారం..జైషే చీఫ్​కు అందించనున్న పాక్​

  న్యూఢిల్లీ: ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత సేనలు పాక్, పీవోకే లోని ఉగ్ర స్థావరాలను కూల్చేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబంతో పాటు 100 మంది టెర్రరిస్టులు చనిపోయారు. ఈ దాడుల నుంచి మసూద్ అజార్ తప్పించుకున్నాడు. కానీ ఆయన కుటుంబం, సమీప బంధువులు మొత్తం 14 మంది హతమయ్యారు. ఇప్పటికే వారికి అధికారికంగా అంత్యక్రియలు జరిపిన పాక్ ప్రభుత్వం.. ప్రస్తుతం పరిహారం కూడా ప్రకటించింది. 

భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కారణంగా చనిపోయిన వారికి రూ. కోటి చొప్పున పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. మసూద్ అజార్ 14 మంది కుటుంబ సభ్యులను కోల్పోవడంతో ప్రభుత్వం ఆయనకు రూ.14 కోట్లు చెల్లించనున్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా బహవల్పూర్​లో ఉన్న ఉగ్ర స్థావరాలపై భారత్ దాడి చేసింది. బహవల్ పుర్ పట్టణంలోనే జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం ఉంది. జామియా మజ్జీద్ సుభాన్ అల్లా లేదా ఉస్మాన్ ఓ అలీ క్యాంపస్ అని కూడా దీన్ని పిలుస్తుంటారు. సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో  సోదరి, ఆమె భర్త, మేనల్లుడు, మేనల్లుడి భార్య, మరో ఐదుగురు చిన్నారులు చనిపోయారని మసూద్ అజార్ ప్రకటించారు.