ఇంటర్నేషనల్‌‌ బాక్సింగ్‌‌ ర్యాంకింగ్స్‌‌లో నాలుగో స్థానానికి పడిపోయిన నిఖత్

ఇంటర్నేషనల్‌‌ బాక్సింగ్‌‌ ర్యాంకింగ్స్‌‌లో నాలుగో స్థానానికి పడిపోయిన నిఖత్

న్యూఢిల్లీ: తెలంగాణ స్టార్‌‌ బాక్సర్‌‌ నిఖత్‌‌ జరీన్‌‌.. ఇంటర్నేషనల్‌‌ బాక్సింగ్‌‌ ర్యాంకింగ్స్‌‌లో నాలుగో స్థానానికి పడిపోయింది. ఈ ఏడాది జరగబోయే కామన్వెల్త్‌‌ గేమ్స్‌‌, ఆసియా గేమ్స్‌‌కు అర్హత సాధించడంలో నిఖత్‌‌ విఫలమైంది. దాంతో ఆమె ర్యాంక్‌‌ ఒక్క ప్లేస్‌‌ దిగజారింది. విమెన్స్‌‌ 57 కేజీల్లో జైస్మిన్‌‌ లంబోరియా నంబర్‌‌వన్‌‌ ర్యాంక్‌‌లో నిలిచింది. ఈ ఏడాది ఆసియా చాంపియన్‌‌షిప్‌‌లో సిల్వర్‌‌ సాధించడం ఆమెకు కలిసొచ్చింది.

 ప్రియ (60 కేజీ), విశ్వనాథ్‌‌ సురేశ్‌‌ (50 కేజీ) వరుసగా రెండు, మూడు ర్యాంక్‌‌ల్లో ఉన్నారు. విమెన్స్‌‌ 48 కేజీల్లో మీనాక్షి నంబర్‌‌వన్‌‌ ర్యాంక్‌‌ను పదిలం చేసుకోగా, 54 కేజీల్లో ప్రీతి పవార్‌‌ ఏకంగా ఐదు స్థానాలు ఎగబాకి మూడో ర్యాంక్‌‌కి చేరింది. అరుంధతి చౌదరి (70 కేజీ), పూజా రాణి (80 కేజీ), నుపుర్‌‌ (+80 కేజీ) తర్వాతి ప్లేస్‌‌ల్లో ఉన్నారు. మెన్స్‌‌ కేటగిరీలో సచిన్‌‌ సివాచ్‌‌ (60 కేజీ), నరేందర్ బెర్వాల్‌‌ (+90 కేజీ) టాప్‌‌–5లోకి ప్రవేశించారు