సత్య లీడ్ రోల్‌లో రితేష్ రానా రూపొందించిన చిత్రం ‘జెట్‌లీ’. మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దమల్లు నిర్మించారు. మే 1న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు రితేష్ రానా ఇలా ముచ్చటించాడు.
‘‘ఇదొక హ్యూమరస్ థ్రిల్లర్. ఈ కథకోసం మిడ్ రేంజ్ హీరోలను అనుకున్నాం. ఈ టైమ్‌లో ఎక్స్‌పెరిమెంట్ అవసరమా అనే అభిప్రాయాలు వచ్చాయి. తర్వాత సత్యకి తగ్గట్టు క్యారెక్టర్ మార్చి తెరకెక్కించాం. సత్య పాత్ర ఫ్లైట్ అటెండర్. ఆయన క్యారెక్టర్‌లో సీరియస్‌నెస్, హ్యూమర్, సస్పెన్స్ అన్నీ ఉంటాయి. తన పాత్ర అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తుంది.
కథ జెట్‌లో జరుగుతుంది కాబట్టి, అలాగే జెట్‌లీ అనే నటుడ్ని ఉద్దేశించి ఇంటరెస్టింగ్‌గా ఉంటుందని ఈ టైటిల్ పెట్టాం. దాదాపు 80 శాతం ఫ్లైట్‌లోనే షూట్ చేశాం. దీనికోసం ఫ్లైట్ సెట్ వేసాం. దుబాయ్ నుంచి కొచ్చికి ల్యాండ్ అయ్యే జర్నీలో జరిగే కథ ఇది. వెన్నెల కిశోర్ టిపికల్ క్యారెక్టర్ చేయగా, హీరోయిన్ రియా సింఘా స్పెషల్ ఏజెంట్ పాత్రలో కనిపిస్తుంది.
ప్రజాపతి అనే పాత్రలో అజయ్ కనిపిస్తారు. ఓ బ్యాంక్ స్కామ్ చేసి పారిపోతుంటారు. ఆయన్ని వెనక్కి తీసుకురావడమే కథలో కీలకం. నా గత సినిమాల తరహాలో ఇందులోనూ చిరంజీవి గారి రిఫరెన్స్ ఉంటుంది. యాక్షన్, థ్రిల్, హ్యూమర్ అన్నీ కలిపిన మంచి ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది.
ప్రొడ్యూసర్ చెర్రీ గారు నా ఎక్స్‌పెరిమెంట్స్‌కి ఎప్పుడూ సపోర్ట్ చేస్తారు. నేను మరో హీరోతో ప్లాన్ చేసి సడన్‌గా సత్యతో చేస్తానన్నా కూడా నాపై పూర్తి నమ్మకం ఉంచారు. సినిమా వర్కౌట్ అయితే సీక్వెల్‌కు మంచి స్కోప్ ఉంది. తర్వాత నాకు ఇష్టమైన హారర్ జానర్‌లో సినిమా
చేయబోతున్నా’’.

