హైదరాబాద్, వెలుగు: ‘ఆర్టీసీ కార్మికుడు శ్రీనివాస్‌రెడ్డి చనిపోయాడు. ఇది చూసైనా సీఎం కేసీఆర్ కండ్లు తెర్వాలె’ అని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. తల్లిలాంటి సంస్థను కాపాడుకోవడం కోసం కార్మికులకు ప్రాణత్యాగాలకు సిద్ధపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఉద్యమ చరిత్రలో శ్రీనివాస్‌రెడ్డి బలిదానమే చివరిది కావాలని ఆకాంక్షించారు. ఆర్టీసీ కార్మికులు చేపట్టే ఆందోళనలో బీసీలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.

