తెలంగాణ బంద్‌‌తో చరిత్ర సృష్టించాం : జాజుల

తెలంగాణ బంద్‌‌తో చరిత్ర సృష్టించాం : జాజుల

ఓయూ, వెలుగు: బీసీ రిజర్వేషన్ల కోసం జేఏసీ తలపెట్టిన తెలంగాణ బంద్ విజయవంతం అయ్యిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. 

రాష్ట్రం ఏర్పడ్డాక బీసీలు ఇచ్చిన మొట్టమొదటి బంద్​పిలుపు అందరి సహకారంతో చరిత్ర సృష్టించిందని చెప్పారు. ఆదివారం ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజ్ వద్ద బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివిధ బీసీ సంఘాల నేతలతో జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. ‘‘బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధతను కల్పించే వరకు తెలంగాణ ఉద్యమ తరహాలో బీసీ ఉద్యమాన్ని కొనసాగిస్తాం”అని తెలిపారు.