
న్యూఢిల్లీ, వెలుగు: బీసీ వ్యతిరేక బీజేపీని భూ స్థాపితం చేసేందుకు ఈ మహాధర్నా నిదర్శనమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ అన్నారు. ఢిల్లీలో ఏప్రిల్ 22న చేసిన ధర్నాతో మోదీ దిగివచ్చి కులగణనకు ఒప్పకున్నారన్నారు. మూడున్నర నెలల తర్వాత తెలంగాణ ప్రభత్వం పంపిన బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించకపోవడం దుర్మార్గమని ఫైర్ అయ్యారు.
బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన పోరుబాట ధర్నాలో జాజుల మాట్లాడారు. ‘‘కేంద్రంలోని అధికార బీజేపీ ప్రభుత్వం రాష్ట్రపతి కార్యాలయంపై ఒత్తిడి తీసుకొచ్చి ఆర్డినెన్స్ రాకుండా చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్లు ఇవ్వని బీజేపీ మనకు అవసరమా? ‘బీజేపీ హటావో.. బీసీ రిజర్వేషన్ బచావో’నినాదంతో ముందుకెళ్లాలి’’అని ఆయన పిలుపునిచ్చారు.
నేడు గోవాలో ఓబీసీ జాతీయ మహాసభ
హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా బీసీల సమస్యలు, వాటి పరిష్కారాలపై చర్చించి కార్యాచరణ ప్రకటించేందుకు గురువారం గోవాలోని శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆడిటోరియంలో 7వ జాతీయ ఓబీసీ మహాసభ నిర్వహించనున్నట్టు జాజుల వెల్లడించారు.