
యాగశాల ఏర్పాట్లకు వేదపండితుల స్థల పరిశీలన
హైదరాబాద్, వెలుగు: కన్నెపల్లి పంప్‌హౌస్‌లో ఈ నెల 21న జలసంకల్ప యాగం చేయాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. యాగం ఏర్పాట్లలో భాగంగా శుక్రవారం వేద పండితులు గోపీకృష్ణ శర్మ, ఫణిశశాంక శర్మ శుక్రవారం స్థల పరిశీలన చేశారు. గోదావరి నదీతీరంతో పాటు పంప్హౌస్వ్యూపాయింట్, డెలివరి స్ట్రెచర్స్థలంలో ఏదో ఒకచోట యాగశాల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. భద్రతకు ఆటంకం కలగకుండా ఏర్పాట్లు చేయడానికి జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్, పోలీసులు.. వేదపండితులతో సమావేశమయ్యా రు. శనివారం నుంచి యాగశాల నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు చెప్పారు.