త్వరలో సీఎం కేసీఆర్ ను కలుస్తా : జలగం వెంకట్ రావు

త్వరలో సీఎం కేసీఆర్ ను కలుస్తా : జలగం వెంకట్ రావు

వనమా వెంకటేశ్వర్ రావు సుప్రీం కోర్టుకు వెళ్లినా న్యాయమే గెలుస్తుందన్నారు బీఆర్ఎస్ నేత జలగం వెంకట్ రావు.  వనమా వెంకటేశ్వర్ రావ్ ఎన్నికల చెల్లదన్న హైకోర్టు ఆర్డర్ కాపీలను, అసెంబ్లీ స్పీకర్ కు,   రాష్ట్ర ఎన్నికల అధికారికి అందజేశానని చెప్పారు.. ఈ ఉత్తర్వులను త్వరగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.  ఈ సందర్భంగా మాట్లాడిన జలగం వెంకట్ రావు.. తాను త్వరలో సీఎం కేసీఆర్ ను కలుస్తానని చెప్పారు.   వనమా వెంకటేశ్వర్ రావు సుప్రీం కోర్టుకు వెళ్లినా..ఎక్కడికెళ్లినా చివరకు న్యాయమే గెలుస్తుందని చెప్పారు. 

కాసేపటి  క్రితం  వనమా వెంకటేశ్వర్ రావు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. సుప్రీం కోర్టుకు వెళ్లేంత వరకు హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరారు.  ఇరు వాదనలు విన్న హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. 

ALSO READ :బొగ్గు స్కాంలో మాజీ ఎంపీకి నాలుగేళ్ల జైలు

2018 ఎలక్షన్ అఫిడవిట్ లో తప్పుడు  సమాచారం ఇచ్చారని జలగం వెంకట్ రావవు 2019లో హైకోర్టులో పిటిషన్ వేశారు.  దీనిపై మూడేండ్ల వాదనల తర్వాత  జులై 25న హైకోర్టు తీర్పు ఇచ్చింది.  వనమా  వెంకటేశ్వర్ రావు ఎన్నిక చెల్లదని తీర్పు ఇచ్చింది. ఆయనపై అనర్హత వేటు వేయడంతో పాటు 5లక్షల జరిమానా విధించింది.