బొగ్గు స్కాంలో మాజీ ఎంపీకి నాలుగేళ్ల జైలు

బొగ్గు స్కాంలో మాజీ ఎంపీకి నాలుగేళ్ల జైలు

ఛత్తీస్ గఢ్ బొగ్గు గనుల కేటాయింపు స్కామ్ లో మాజీ ఎంపీ విజయ్ దర్దాకు నాలుగేళ్ల జైలుశిక్ష పడింది. ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు బుధవారం (జులై 26న) నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. ఛత్తీస్‌గఢ్‌లోని బొగ్గు క్షేత్రాల కేటాయింపులో అక్రమాలకు సంబంధించిన కేసులో ఆయన కుమారుడు దేవేందర్ దర్దా, జేఎల్ డీ యవత్మాల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ మనోజ్ కుమార్ జైశ్వాల్ కు కూడా నాలుగేళ్ల జైలు శిక్ష పడింది.

ఇదే కేసులో బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి హెచ్‌సీ గుప్తా, ఇద్దరు సీనియర్ పబ్లిక్ సర్వెంట్లు కెఎస్ క్రోఫా, కెసి సమ్రియాకు కూడా కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. కోర్టు ఆదేశాల మేరకు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 

ALSO READ :త్వరలో సీఎం కేసీఆర్ ను కలుస్తా : జలగం వెంకట్ రావు

బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి హెచ్‌సి గుప్తా, ఇద్దరు మాజీ సీనియర్ పబ్లిక్ సర్వెంట్లు కెఎస్ క్రోఫా, కెసి సమ్రియాలకు మూడేళ్ల జైలు శిక్ష విధించారు ప్రత్యేక న్యాయమూర్తి సంజయ్ బన్సల్. అయితే.. ఈ ముగ్గురు తమ నేరాన్ని, శిక్షను హైకోర్టులో సవాలు చేసేందుకు వీలుగా కోర్టు వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది.

2014 నవంబరు 20న ఈ కేసును మూసేస్తామని కోరుతూ కోర్టులో సీబీఐ అఫిడవిట్‌ దాఖలు చేసింది. కోర్టు దీనికి అంగీకరించలేదు. మళ్లీ కొత్తగా దర్యాప్తు చేయాలని ఆదేశించింది. దీంతో మళ్లీ దర్యాప్తు జరిగి మాజీ ఎంపీ సహా ఏడుగురు దోషులుగా తేలారు.