తమిళనాడులో జల్లికట్టు సందడి

తమిళనాడులో జల్లికట్టు సందడి

తమిళనాడులో పోట్లగిత్తల్ని లొంగదీసుకునేందుకు యువత పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. పొంగల్  వేడుకల్లో భాగంగా సంప్రదాయంగా వస్తున్న జల్లికట్టు ఆటలో పాల్గొనేందుకు యువత ఉత్సహం కనబర్చుతున్నారు. మధురైలోని పోటీల్లో 300 మందికే అనుమతి ఇచ్చారు.  ఇక్కడ జరిగే 3 ఈ వెంట్లలో పాల్గొనేందుకు, 5 వేల ఎడ్లను రిజిస్టర్ చేయించుకున్నారు. కోవిడ్ కారణంగా పరిమిత సంఖ్యలో ప్రేక్షకుల్ని మాత్రమే అనుమతించేలా ఏర్పాట్లు చేసినా జనం మాత్రం పోటెత్తారు. మధురైలోని అవనియాపురంలో జల్లికట్టు కోలాహలం కనిపిస్తోంది. జల్లికట్టు విజేతలకు ఎమెల్యే ఉదయనిధి స్టాలిన్  బహుమతులు అందచేస్తారు. జల్లికట్టులో పాల్గొనేవారందరికీ తప్పనిసరిగా వ్యాక్సినేషన్ పూర్తై ఉండాలనే నిబంధన పెట్టారు. అంతేకాదు బరిలోకి వెళ్లే ముందు కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్ సమర్పించడం లాంటి నిబంధనల్ని తప్పనిసరి చేశారు. పోట్ల గిత్తల్నిమచ్చిక చేసుకుని, లొంగదీసినవారే ఈ పోటీల్లో విజేతగా నిలుస్తారు. గతంలో ఎద్దుల మెడలో పకలల్ని కట్టేవారు. అవి తీసుకొచ్చినవారు విజేతలయ్యేవారు. కానీ ఇప్పుడు ఆ పద్ధతి మారింది. ఎక్కువ సేపు ఎద్దును కట్టడి చేయగలిగినవారినే విజేతలుగా నిర్ణయిస్తున్నారు. 

ఇవి కూడా చదవండి:  

అయోధ్యలో రాముడి గుడిపై త్రీడీ వీడియో

భారత్లో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి