భారత్లో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి

భారత్లో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి

భారత్ లో కరోనా కలకలం కొనసాగుతోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2 లక్షల 68 వేల 833 మందికి కరోనా సోకింది. ఇందులో మహారాష్ట్ర నుంచి 43 వేల 211, ఢిల్లీలో 24 వేల 383 కేసులు నమోదయ్యాయి. దేశంలో నిన్నటి కంటే 4 వేల 631 కేసులు ఎక్కువగా పెరిగాయి. లక్షా 22 వేల 684 మంది వైరస్ నుంచి కోలుకోగా 402 మంది చనిపోయారు. దేశంలో ప్రస్తుతం 14 లక్షల 17 వేల 820 యాక్టివ్ కేసులు ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 16.66 శాతానికి చేరుకుంది. మరోవైపు ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్ కేసులు 6వేలు దాటాయి.  ఇప్పటివరకు కరోనా సోకి 4 లక్షల 85వేల 752 మంది చనిపోయారు. 

ఇవి కూడా చదవండి: 

నవోదయలో 1925 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్

అయోధ్యలో రాముడి గుడిపై త్రీడీ వీడియో