శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా 2 గంటల్లో 21 కిలోమీటర్లు పరుగెత్తారు. ఆదివారం శ్రీనగర్‌లోని పోలో స్టేడియంలో తొలి అంతర్జాతీయ మారథాన్‌ను ఒమర్ జెండా ఊపి ప్రారంభించారు. దేశ విదేశాలకు చెందిన 2 వేల మంది అథ్లెట్లు అందులో పాల్గొన్నారు. దాల్ సరస్సు వెంట సాగిన హాఫ్ మారథాన్‌లో అథ్లెట్లతో కలిసి ఒమర్ పరుగెత్తారు. దీనికి సంబంధించిన వీడియోలను ఆయన ఎక్స్‌లో పోస్ట్‌చేశారు. "ఈ రోజు నేను కాశ్మీర్ హాఫ్ మారథాన్ (21 కి.మీ.) ను 2 గంటల్లో పూర్తి చేశాను.
నేను నా జీవితంలో ఎప్పుడూ 13 కి.మీ. కంటే ఎక్కువ పరుగెత్తలేదు. ఎలాంటి శిక్షణ, రన్నింగ్ప్లాన్, పోషకాహారం లేకుండా.. కేవలం ఒక అరటి పండు, రెండు ఖర్జూరాలు మాత్రమే తీసుకొని మారథాన్పూర్తిచేశాను" అని పేర్కొన్నారు.