
జమ్ముకశ్మీర్‌లోని అవంతిపోరాలో ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా దళాలలకు .. ఉగ్రవాదులకు జరిగిన ఎదరుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు.
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో నరమేధం సృష్టించిన ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు భద్రతా దళాలు వేట కొనసాగిస్తున్నాయి. అవంతిపోరాలో ఈరోజు (మే 15) ఉదయం భద్రతా దళాలకు.. టెర్రరిస్టులకు ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారని పోలీసులు తెలిపారు.
దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా ఉప జిల్లా అవంతిపోరా ప్రాంతంలోని ట్రాల్ పరిధిలో నాదర్ గ్రామంలో కార్టన్ సెర్చ్ నిర్వహిస్తున్న సమయంలో ఉగ్రవాదుల కదలికలను పోలీసులు గుర్తించారు. . దీంతో ఉగ్రవాదులు కాల్పులు జరపగా .. భద్రతా దళాలు కూడా ఎదరు కాల్పులు జరిపారు.
జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఎన్ కౌంటర్ జరిగిందని ధ్రువీకరించారు. పోలీసులు, భద్రతా బలగాలు ఉగ్రవాదులను పట్టుకునే పనిలో ఉన్నారు. భద్రతా సిబ్బంది సంయుక్త బృందాలు ఈ ఆపరేషన్‌లో చురుగ్గా పాల్గొంటున్నాయని తెలిపారు.
#Encounter has started at Nader, Tral area of #Awantipora. Police and security forces are on the job. Further details shall follow.@JmuKmrPolice
— Kashmir Zone Police (@KashmirPolice) May 15, 2025
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భద్రతా బలగాలు ఉగ్రవాదులు ఏరివేతను ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే రెండ్రోజుల క్రితం షోపియాన్ లో జరిగిన ఎన్కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. జంపాత్రి కెల్లర్ ప్రాంతంలో భద్రతా బలగాలు, కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి ఉగ్రవాదులను మట్టుబెట్టారు.
48 గంటల్లో రెండో సారి కాల్పులు
మంగళవారం (మే 13) జమ్మూ కాశ్మీర్‌లోని షోపియన్‌లో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు . ఈ ఎన్‌కౌంటర్ మొదట కుల్గాంలో ప్రారంభంకాగా... షోపియన్‌లోని అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఇంటిలిజెన్స్ అధికారుల సమాచారం మేరకు ఈ ప్రాంతంతో ఉగ్రవాదులు దాక్కొన్నారనే సమాచారంతో భద్రతా దళాలు ఉగ్రవాదులను ఏరివేసేందకు చర్యలు చేపట్టారు.
షోపియన్‌లోని షూకల్ కెల్లర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్ ఇంటిలిజెన్స్ సమాచారం మేరకు భద్రతా దళాలు కూంబింగ్ ఆపరేషన్‌ను ప్రారంభించారు. ఈ సమయంలో భద్రతా దళాలు... టెర్రరిస్ట్ మూకలు ఎదరు పడినప్పుడు కాల్పులు జరిపారు. పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇంకా ఈ ఆపరేషన్ కొనసాగుతుందని భారత సైన్యం ట్విట్టర్ Xలో పోస్ట్ చేసింది.
OPERATION KELLER
— ADG PI - INDIAN ARMY (@adgpi) May 13, 2025
On 13 May 2025, based on specific intelligence of a #RashtriyasRifles Unit, about presence of terrorists in general area Shoekal Keller, #Shopian, #IndianArmy launched a search and destroy Operation. During the operation, terrorists opened heavy fire and fierce… pic.twitter.com/KZwIkEGiLF
ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన తర్వాత, జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదుల కదలికలపై భారత సైన్యం దృష్టి పెట్టింది. మే 7న ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభిం... పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలనుధ్వసం చేసింది. ఆ తరువాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకోవడం.. ఆ తరువాత కాల్పుల విరమణకు ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. మే 10న భారత... పాకిస్తాన్ లు కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నాయి. అయితే ఒప్పందం అమల్లోకి వచ్చిన కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ దానిని ఉల్లంఘించింది.