NAM vs NEP: 33 బంతుల్లో సెంచరీ.. నమీబియా బ్యాటర్ వరల్డ్ రికార్డ్

NAM vs NEP: 33 బంతుల్లో సెంచరీ.. నమీబియా బ్యాటర్ వరల్డ్ రికార్డ్

అంతర్జాతీయ క్రికెట్ లో పసికూన బ్యాటర్ జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్ వరల్డ్ రికార్డ్ సెట్ చేశాడు. టీ20 క్రికెట్ లో 33 బంతుల్లోనే సెంచరీ కొట్టి ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన ప్లేయర్ గా నిలిచాడు. నేపాల్ పై జరుగుతున్న టీ20 మ్యాచ్ లో నికోల్ లాఫ్టీ ఈ ఘనత సాధించాడు. మ్యాచ్ మొత్తం బౌండరీల వర్షం కురిపించిన ఇతని ఇన్నింగ్స్ లో 8 సిక్సులు, 11 ఫోర్లు ఉన్నాయి. మొత్తం ఈ మ్యాచ్ లో 36 బంతుల్లో 101 పరుగులు చేసి ఔటయ్యాడు. 

నిన్నటి వరకు టీ20 క్రికెట్ లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రికార్డ్  నేపాల్ బ్యాటర్ కుషాల్ మల్లా పేరిట ఉంది. ఆసియా క్రీడలు 2023లో భాగంగా మంగోలియాపై  2023లో ఈ నేపాలీ బ్యాటర్ 34 బంతుల్లోనే తన సెంచరీ పూర్తి చేసుకొని.. ప్రస్తుత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, సౌతాఫ్రికా విధ్వంసకర వీరుడు మిల్లర్ రికార్డ్ ను బ్రేక్ చేశాడు. వీరిద్దరూ 35 బంతుల్లో టీ20ల్లో సెంచరీ పూర్తి చేసుకున్నారు. తాజాగా కుషాల్ ఫాస్టెస్ట్ సెంచరీని జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్ 33 బంతుల్లో బ్రేక్ చేశాడు. నికోల్ లాఫ్టీ సెంచరీతో నమీబియా భారీ స్కోర్ చేసింది. 

ALSO READ :- బిగ్ బ్రేకింగ్ : గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్

నేపాల్ ట్రై సిరీస్ లో భాగంగా మొదట బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. నికోల్ లాఫ్టీ-ఈటన్ (101) సెంచరీకి తోడు క్రూగర్ (59) హాఫ్ సెంచరీ చేశాడు. లక్ష్య ఛేదనలో నేపాల్ కూడా ధీటుగా ఆడుతుంది. ప్రస్తుతం 7 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది. 20 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయినా కెప్టెన్ పౌడల్(36), కుశాల్ మల్లా (27) నిలకడగా ఆడుతున్నారు.