కోలీవుడ్ స్టార్ విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘జన నాయగన్’. హెచ్ వినోద్ దర్శకత్వంలో కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై యగదీష్ పళనిస్వామి, లోహిత్ కలిసి నిర్మించారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 9న వరల్డ్‌వైడ్‌గా సినిమా విడుదల కానుంది. తెలుగులో ‘జన నాయకుడు’ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే రీసెంట్‌గా రిలీజ్ చేసిన ట్రైలర్‌ను బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ చిత్రంతో పోలుస్తూ ట్రోల్స్ వస్తున్నాయి.
వాస్తవానికి ఈ సినిమా మొదటి నుంచి ‘భగవంత్ కేసరి’ రీమేక్ అని ప్రచారం జరుగుతుండగా, తాజాగా రిలీజైన ట్రైలర్‌తో క్లారిటీ వచ్చింది. అలాగనీ సినిమా మొత్తం భగవంత్ కేసరి కాదని విజయ్ టీవీకే పార్టీ నేపథ్యాన్ని జనాల్లోకి తీసుకెళ్లేలా ఇందులో పొలిటికల్ ఎలిమెంట్స్‌ను కూడా చూపించారు. అయితే విజయ్ కెరీర్‌లో రానున్న చివరి సినిమా కోసం రీమేక్ కథను ఎంచుకోవడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
