వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 సీట్లు గెలుస్తాం : జానారెడ్డి 

వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 సీట్లు గెలుస్తాం : జానారెడ్డి 

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ నాయకుల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నా... అవసరం వచ్చినప్పుడు అందరం ఐక్యంగా ముందుకెళ్తామని ఆ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల ఉత్సాహం చూస్తేంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని12 సీట్లలోనూ గెలిపిస్తారని అనిపిస్తోందన్నారు. యుద్ధం వచ్చినపుడు అందరం ఐక్యంగా పోరాడతామన్నారు. కాంగ్రెస్ హయాంలో జిల్లాకు 14 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని చెప్పారు. 

.

ఎనిమిదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం కాలువలు తవ్వలేదని జానారెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉమ్మడి నల్గొండ జిల్లాకు జలకళ తీసుకొస్తామన్నారు. ఎనిమిదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం పేదలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు.