మహిళల అభ్యున్నతి కోసమే స్త్రీనిధి : కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

మహిళల అభ్యున్నతి కోసమే స్త్రీనిధి : కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్
  • కలెక్టర్ ​రిజ్వాన్ భాషా షేక్

జనగామ అర్బన్, వెలుగు : పేద మహిళల అభ్యున్నతి కోసమే స్త్రీనిధి పనిచేస్తుందని జనగామ కలెక్టర్​ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు. స్త్రీ నిధి క్రెడిట్​ కో–ఆపరేటివ్​ఫెడరేషన్ పనితీరు, ఆర్థిక ప్రణాళికలు రుణాలపై గురువారం కలెక్టరేట్​లోని అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ క్రెడిట్ ప్లాన్ మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని, వేగవంతంగా లోన్​ రికవరీ చేయాలని అధికారులను ఆదేశించారు. 

 బ్యాంకు లింకేజీ రుణాలకు సంబంధించి ఎస్​హెచ్​జీ సంఘాలు లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. ఎస్ హెచ్ జీ లో కొత్త సభ్యులను ప్రతి మంగళ, శనివారం రికవరీ డే గా పెట్టుకొని వచ్చే మార్చి వరకు జిల్లాలో ఎలాంటి డ్యూ లేకుండా చూడాలన్నారు. లోన్ బీమా, ప్రమాద బీమాకు సంబంధించిన పెండింగ్​ కేసులను త్వరగా పూర్తిచేయాలని చెప్పారు. జిల్లాలో 50 వనితా టీ స్టాళ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.  

నేడు వందేమాతరం గీతాలాపన..

మహాకవి బకిమ్ చంద్రఛటర్జీ రచించిన వందేమాతరం నేటితో 150 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జాతీయ గీతాన్ని సామూహిక గానం చేయనున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్​ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కలెక్టరేట్ లో శుక్రవారం ఉదయం 10 గంటలకు వందేమమాతరం సామూహిక గీతాలాపన కార్యక్రమం ఉంటుందని తెలిపారు.