ఏరికోరి ఓడింది

ఏరికోరి ఓడింది
  • రిజల్ట్‌‌ రీకౌంటింగ్​లో టీఆర్​ఎస్​కు ఓటమి.. స్వతంత్రుడి గెలుపు
  • కోరికోరి రెండోసారి రీకౌంటింగ్​ పెట్టించుకుని ఒక్క ఓటుతో ఓటమి

కౌంటింగ్​లో ఆమె గెలిచారు. ఇంకో అభ్యర్థి కోరిక మేరకు చేసిన రీకౌంటింగ్​లో ఓట్లు సమానంగా వచ్చినా బ్యాలెట్​ ఓటుతో గట్టెక్కారు. అరె మెజారిటీ తక్కువొచ్చిందని మళ్లీ ఆమె కోరికోరి రీకౌంటింగ్​ పెట్టించుకున్నారు. చివరకు ఒక్క ఓటుతో గెలిచిన ఆమే.. అదే ఒక్క ఓటుతో ఓడిపోయారు. స్వతంత్ర అభ్యర్థి అనూహ్యంగా గెలిచారు. ఈ చేదు అనుభవం జనగామ జిల్లా దేవరుప్పల మండలం మాధపురం టీఆర్​ఎస్​ ఎంపీటీసీ అభ్యర్థికి ఎదురైంది. కౌంటింగ్​లో ముందుగా టీఆర్​ఎస్​ అభ్యర్థి లకావత్​ సుగుణకు 701 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి బానోత్​ యాకుబ్​కు 693 ఓట్లు రాగా, కాంగ్రెస్​ అభ్యర్థి ధరావత్​ సక్రుకు 269 ఓట్లు పోలయ్యాయి. అయితే, ధరావత్సక్రు రీకౌంటింగ్​ చేయాల్సిందిగా కోరారు.

రీకౌంటింగ్​లో లకావత్​ సుగుణకు పడిన 8 ఓట్లు చెల్లవని తేలింది. ఓట్లు 693కు పడిపోయి యాకుబ్​కు సమానం గా నిలిచారు. అయినా బ్యాలెట్​ ఓటుతో సుగుణ గెలిచారు. తక్కువ మెజారిటీ వచ్చిందని, మళ్లీ ఇంకోసారి ఓట్లు లెక్కబెట్టా లని సుగుణ కోరారు. అలా కోరికోరి అడిగి ఆమె నష్టా న్ని కొని తెచ్చుకున్నా రు. రీకౌంటింగ్​లో మరో రెండు ఓట్లు చెల్లవని తేలింది. దీంతో ఆమెకు వచ్చిన ఓట్లు 692కు తగ్గాయి. చివరకు ఒక్క ఓటుతో స్వతంత్ర అభ్యర్థి యాకుబ్​ గెలిచారు. తమ ఏజెంట్లు లేని సమయంలో కౌంటింగ్​ చేశారని, దీనిపై కలెక్టర్​కు ఫిర్యాదు చేస్తా మని, ఓట్లను మళ్లీ లెక్కిం చాలని సుగుణ డిమాండ్ చేశారు.