సిరాజ్‌‌కు రాఖీ కట్టిన జానై భోస్లే.. ఒక్క ఫొటోతో రూమర్లకు చెక్

సిరాజ్‌‌కు రాఖీ కట్టిన జానై భోస్లే.. ఒక్క ఫొటోతో రూమర్లకు చెక్

హైదరాబాద్: టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్​ సిరాజ్‌‌ బాలీవుడ్ లెజెండరీ సింగర్‌‌‌‌ ఆషా భోస్లే కుమార్తె  జానై భోస్లేతో రక్షా బంధన్ జరుపుకున్నాడు. ఈ సందర్భంగా జానై.. సిరాజ్‌‌కు రాఖీ కట్టింది. గతంలో వీరు కలిసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌‌ అవ్వగా.. ఇద్దరూ డేటింగ్‌‌ చేస్తున్నారన్న పుకార్లు వచ్చాయి. అయితే, వాటిని ఖండించిన సిరాజ్‌‌, జానై తమ మధ్య అన్నాచెల్లెళ్ల లాంటి సంబంధం మాత్రమే ఉందని స్పష్టం చేశారు. తాజాగా సిరాజ్‌‌కు రాఖీ కడుతున్న వీడియోను జానై తన ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో షేర్ చేసి.. సబ్‌‌సే బెస్ట్ భాయి (మంచి సోదరుడు) అని క్యాప్షన్ ఇచ్చింది. దీన్ని సిరాజ్ తన ఇన్‌‌స్టాలో కూడా షేర్ చేయగా.. వీడియో వైరల్ అయింది. తోటి క్రికెటర్ రిషబ్‌‌ పంత్  లవ్ ఎమోజీతో స్పందించాడు.