హైదరాబాద్, వెలుగు: రియల్ ఎస్టేట్ సంస్థ జనప్రియ గ్రూప్ విస్తరణ బాట పట్టింది. త్వరలో మరిన్ని ప్రాజెక్టులు చేపడతామని సంస్థ ఫౌండర్ రవీందర్ రెడ్డి తెలిపారు. తమ సంస్థ 40 ఏళ్లు పూర్తి చేసుకుందని, 40 వేల ఫ్లాట్లను నిర్మించిందని చెప్పారు.
ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన సంస్థ 40వ వార్షికోత్సవం సందర్భంగా మాట్లాడుతూ ఎన్నో సవాళ్లను తట్టుకుని ఈ స్థాయికి చేరుకున్నామని చెప్పారు. అందరికీ అందుబాటులో ఉండే ఇళ్లు కట్టించి ఇవ్వడమే తమ ఉద్దేశమని తెలిపారు.
జనప్రియ కొత్త ప్రాజెక్టులు శిఖర (అదిబట్ల), నైల్ వ్యాలీ (మియాపూర్) ప్రాజెక్టులు 2027 నాటికి పూర్తవుతాయి. యూనిటీ (ఇస్నాపూర్), ఆర్కాడియా (కౌకూర్) అపార్ట్‌మెంట్ల హ్యాండోవర్ ఇప్పటికే మొదలయింది.
