కాళేశ్వరం పేరిట లక్ష కోట్లు దుర్వినియోగం: జానారెడ్డి

కాళేశ్వరం పేరిట లక్ష కోట్లు దుర్వినియోగం: జానారెడ్డి

యాదాద్రి, వెలుగు : సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ కాళేశ్వరం పేరిట లక్షల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని, నాణ్య త లోపంతోనే మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ కుంగిపోయిందని మాజీ మంత్రి జానారెడ్డి ఆరోపించారు. బుధవారం యాదాద్రి జిల్లా భువనగిరి మండలం అనాజీపురంలో జరిగిన కాంగ్రెస్​ ముఖ్య కార్యకర్తల మీటింగ్‌‌‌‌కు చీఫ్‌‌‌‌ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ఇచ్చిన హామీలను అమలు చేయడంలో సర్కారు విఫలమైందని విమర్శించారు.

రుణమాఫీ ఇప్పటివరకూ సరిగా చేయలేదని, నిరుద్యోగ భృతి ఊసే లేకుండా పోయిందన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు సోనియాగాంధీ తెలంగాణ ఇస్తే.. కేసీఆర్​ కుటుంబం పదవులు అనుభవిస్తోందని మండిపడ్డారు.  ఏ ఎగ్జామ్ జరిగినా పేపర్లు లీకులు అయ్యాయని, పేపర్​ లీకుల తెలంగాణగా మార్చారని విమర్శించారు.  వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్​ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని జానారెడ్డి ప్రకటించారు. అనంతరం వివిధ పార్టీల కార్యకర్తలకు కాంగ్రెస్‌‌‌‌లో చేరగా.. కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్​ కసిరెడ్డి నారాయణ రెడ్డి, కాంగ్రెస్​ లీడర్​ కుంభం అనిల్​కుమార్​ రెడ్డి, తంగెళ్లపల్లి రవికుమార్​ఉన్నారు.