ఎక్సైజ్ కానిస్టేబుల్ తమ్ముడికి సర్కార్ జాబ్.. సౌమ్య కుటుంబానికి అండగా నిలిచిన ప్రభుత్వం

ఎక్సైజ్ కానిస్టేబుల్ తమ్ముడికి సర్కార్ జాబ్.. సౌమ్య కుటుంబానికి అండగా నిలిచిన ప్రభుత్వం

నిజామాబాద్, వెలుగు: గంజాయి స్మగ్లర్ల వాహన దాడిలో గాయపడి మృతిచెందిన ఎక్సైజ్​ కానిస్టేబుల్ గాజుల సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచింది. ఆమె తమ్ముడు గాజుల శ్రావణ్‌‌ను అదే శాఖలో జూనియర్ అసిస్టెంట్‌‌గా నియమిస్తూ సోమవారం కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు అందజేశారు. గత నెల 23న రోడ్డుపై చెకింగ్ నిర్వహిస్తున్న సమయంలో గంజాయి స్మగ్లర్లు ఢీకొట్టడంతో సౌమ్య తీవ్రంగా గాయపడ్డారు.

ఆమెను హైదరాబాద్‌‌లోని నిమ్స్ కు తరలించగా చికిత్స పొందుతూ 31న మరణించారు. ఈ కేసులో నలుగురు స్మగ్లర్లను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. సౌమ్య మృతి అనంతరం సీఎం రేవంత్ రెడ్డి రూ.కోటి నష్టపరిహారం అందజేశారు.

కుటుంబానికి ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ఇచ్చిన హామీ మేరకు నెల రోజుల్లోనే గాజుల శ్రావణ్‌‌కు నియామక ఉత్తర్వులు జారీ చేశారు. కార్యక్రమంలో ఎక్సైజ్​ డీసీ సోమిరెడ్డి, సూపరింటెండెంట్ మల్లారెడ్డి, సీఐ స్వప్న పాల్గొన్నారు.