మా భూముల సంగతేంటి?.. ఎయిర్‌‌పోర్ట్ ల్యాండ్స్పై క్లారిటీ ఇవ్వాలని నిర్వాసితుల నిరసన

మా భూముల సంగతేంటి?.. ఎయిర్‌‌పోర్ట్ ల్యాండ్స్పై క్లారిటీ ఇవ్వాలని నిర్వాసితుల నిరసన

ఆదిలాబాద్ టౌన్, వెలుగు: ఆదిలాబాద్ ఎయిర్‌‌పోర్ట్ ప్రతిపాదనలో తమ భూముల పరిస్థితిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భూ నిర్వాసితులు సోమవారం కలెక్టరేట్ ఆవరణలో నిరసన తెలిపారు. స్పందించిన కలెక్టర్ రాజర్షి షా నిరసనకారుల వద్దకు వెళ్లి వారిని సముదాయించారు.

సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. ప్రస్తుతం బయటకు వచ్చిన మాస్టర్ ప్లాన్ కేవలం డ్రాఫ్ట్ మాత్రమేనని, అది ఫైనల్​ మ్యాప్ కాదని స్పష్టం చేశారు. గ్రామాలు ప్రతిపాదిత ప్రణాళికలోకి రాకుండా ట్రాఫిక్ డైవర్షన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, డ్రాఫ్ట్‌‌లో అవసరమైన మార్పులు చేసి తిరిగి పంపిస్తామని తెలిపారు.