
- రేవంత్సర్కార్కు ఢోకా లేదు
- ఎంపీ ఎన్నికల్లో -అసెంబ్లీ ఫలితాలే రిపీట్
- బీఆర్ఎస్కు శృంగభంగం తప్పదు
హైదరాబాద్: కాంగ్రెస్ సర్కార్ఏడాది కూడా ఉండే పరిస్థితి లేదని మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి, కాంగ్రెస్సీనియర్నేత జానారెడ్డి కౌంటర్ స్ట్రాంగ్కౌంటర్ఇచ్చారు. బీఆర్ఎస్ నేతలు ఫ్రస్ట్రేషన్ లోఉన్నారని, రేవంత్సర్కార్కు ఎలాంటి ఢోకా లేదన్నారు. అసెంబ్లీ ఫలితాలే ఎంపీ ఎన్నికల్లో రిపీట్అవుతాయని స్పష్టంచేశారు.
ఇవాళ జానారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ‘ప్రజలే పట్టుకొమ్మలై కాంగ్రెస్ కు అండగా నిలిచారు. ప్రభుత్వాన్ని కూల్చాలని ట్రై చేసేళ్లకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారు. బీఆర్ఎస్నేతలకు కాంగ్రెస్ను విమర్శించే అర్హత లేదు. పదేండ్ల పాలనలో వాళ్లుఏమీ చేయలేదు. రాజకీయ లబ్ధికోసమే గులాబీ పార్టీ ప్రజలను రెచ్చగొడుతోంది. వచ్చే ఎన్నికనల్లో బీఆర్ఎస్కు శృంగభంగం తప్పదు. తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ప్రజల మద్దతు మాకే ఉంది’ అని జానారెడ్డి అన్నారు.