ఇద్దరు కంసులతో జనసేన యుద్ధం: పవన్

ఇద్దరు కంసులతో జనసేన యుద్ధం: పవన్

చంద్రబాబు, జగన్ ఇంద్దరూ కంసులే. జనసేన కృష్ణుడంటే వారికి భయం.భారతంలో కృష్ణు డు ఒక్క కంసుడితో యుద్ధం చేస్తే..జనసేన ఇద్దరు కంసులతో యుద్ధం చేస్తోంది” అని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు.సోమవారం పశ్చిమగోదావరి జిల్లా ఆచంట,తణుకు, నిడదవోలు, తాడేపల్లిగూడెంలో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. “ఆంధ్రుల ఆత్మగౌర వాన్ని కేసీఆర్ కాళ్ల దగ్గర జగన్ ​తాకట్టు పెట్టలేను. కేసీఆర్ వేసే బిస్కెట్లకు నేను పడను. కేసీఆర్ చెంతకు చేరి ఊడిగం చేయాల్సి న అవసరం నాకు లేదు. అవినీతిని అంతం చేస్తానని రెం డేళ్లు జైల్లో కూర్చుని వచ్చిన జగన్​ చెబుతుంటే నమ్మాలా? కేసుల నుంచి తప్పించుకోవడానికి ఢిల్లీ వెళ్లి మోడీ,అమిత్ షా కాళ్లు పట్టుకు న్న జగన్ ఆంధ్రుల ఆత్మగౌరవం ఎలా కాపాడుతారు? జగన్​ ఆరోపిస్తు న్నట్లు టీడీపీతో జతకట్టడానికి నాకేమైనా పిచ్చా. టీడీపీ సైకిల్ చైన్​ తెగిపోయి చాలా కాలమైంది. 2018లోనే వాళ్ల అవినీతిని ప్రజాక్షేత్రంలో కడిగేసి సైకిల్ చైన్ తెంపేశా. చంద్రబాబు కనుకు 36 సార్లు మాట మారుస్తారు. చంద్రబాబు ఎప్పుడు ఏం మాట్లా డుతారో ఆయనకే తెలియదు. ఆయనకు లోకేశ్ భవిష్యత్తు తప్ప ప్రజల భవిష్యత్తు పట్టదు” అని విమర్శించారు. కేసులకు భయపడి చంద్రబాబు హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారని ఎద్దేవా చేశారు. వయసైపోయిన చంద్రబాబుకి ఫింఛన్​ ఇచ్చి గౌరవంగా రాజకీయాల నుంచి తప్పిద్దామని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.‘జనసేనను ఎంతవరకు మోయగలవు అని కొందరు అడుగుతున్నారు. నలుగురు వచ్చినాశ వాన్ని మోసే వరకు జనసేన పార్టీని మోస్తా. వైఎస్సార్ సీపీతో కలిసి వెళ్లాలని జగన్​ కోరుకుంటున్నారని కొందరు తెలంగాణ నాయకు లు సలహా ఇచ్చారు. సీఎం అంటే జగన్​ ఒక్కరేనా ? ప వ న్ క ల్యాణ్ కాకూడదా? సీఎం అంటే పులివెందుల నుంచే రావాలా? సామాన్యుల నుంచి రాకూడ దా”అని ప్రశ్నించారు.