జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడో విడత వారాహి యాత్రకు సిద్దమయ్యారు. ఇప్పటికే రెండు విడతల్లో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించారు. ఈ సారి విశాఖపట్నం జిల్లాలో వారాహి యాత్ర కొనసాగుతుందని ప్రకటించారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఈ రోజు ( ఆగస్టు3) మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో విశాఖ జిల్లా నాయకులు, వారాహి యాత్ర కమిటీలతో సమావేశం నిర్వహించారు జనసేనాని. ఆగస్టు 10 వ తేదీన విశాఖపట్నం నగరంలో మూడో విడత వారాహి యాత్ర ప్రారంభమవుతుందన్నారు. 19వ తేదీ వరకు కొనసాగే యాత్రలో విశాఖలో చోటు చేసుకొంటున్న భూకబ్జాలకు సంబంధించిన పరిశీలనలు ఉంటాయి. విశాఖలో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తారని జనసేన ప్రకటించింది.
మూడో విడత యాత్ర పూర్తయ్యేలోపు భూకబ్జాలు ఆగాలని వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర వనరుల దోపిడీని నిలువరిద్దాం అంటూ విశాఖ జిల్లా నాయకులు, వారాహి యాత్ర కమిటీలతో నిర్వహించిన సమావేశంలో పిలుపునిచ్చారు పవన్.. వారాహి యాత్ర గురించి దేశం మొత్తం చెప్పుకోవాలన్న ఆయన ... చాయితీరాజ్ వ్యవస్థను చంపేందుకే వైసీపీ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారని విమర్శలు గుప్పించారు .
