జనసేనలో చేరిన జేడీ లక్ష్మీనారాయణ

జనసేనలో చేరిన జేడీ లక్ష్మీనారాయణ

సీబీఐ మాజీ జేడీ VV లక్ష్మీనారాయణ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరారు. విజయవాడలోని పార్టీ ఆఫీస్ లో కండువా కప్పి లక్ష్మీ నారాయణను పార్టీలోకి ఆహ్వానించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. మాజీ ఐఏఎస్ అధికారి వీవీ లక్ష్మినారాయణతోపాటు… శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ మాడీ వైస్ చాన్సులర్ రాజగోపాల్ కూడా జనసేనలో చేరారు.

“మార్పు అంటే ఏంటో మేమిద్దరం కలిసి ప్రజలకు చూపిస్తాం. మామూలుగా 1+1 అంటే 2 అవుతుంది. కానీ మా ఇద్దరి విషయంలో 1+1 అంటే 11 అవుతుంది. జనసేన మేనిఫెస్టోను పవన్ కల్యాణ్ రూపొందించిన విధానం నచ్చింది. జనసేనను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తా” అని వీవీ లక్ష్మినారాయణ చెప్పారు.

లక్ష్మినారాయణను రాయలసీమ నుంచి లోక్ సభ ఎన్నికల బరిలో దింపుతామని పవన్ కల్యాణ్ సూచనలు ఇచ్చారు. త్వరలోనే దీనిపై క్లారిటీ ఇస్తామన్నారు.

శనివారం అర్ధరాత్రి పవన్ కల్యాణ్ తో సమావేశమైన లక్ష్మీనారాయణ 45 నిమిషాల పాటు వివిధ అంశాలపై చర్చించారు. మార్పు కోసం జనసేన స్థాపించిన పవన్ కల్యాణ్ కు కృతజ్ఞతలు చెప్పారు .2014లోనే పవన్ తో కలిసి పనిచేద్దామనుకున్నానని, అది ఇప్పటికీ సాధ్యమైందన్నారు.