
హైదరాబాద్: క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న తన అభిమాని, పార్టీ కార్యకర్త అయిన బుడిగెయ్య అనే వ్యక్తిని పరామర్శించి ధైర్యం చెప్పారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. మంగళవారం ఉదయం తన పార్టీ ఆఫీస్ లో కలిసిన ఆ క్యాన్సర్ బాధితుడి ఆరోగ్యం గురించి పవన్ ఆరా తీశారు. అతని వెద్య ఖర్చుల నిమిత్తం రూ. లక్ష ఆర్ధిక సాయం చేశారు.
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం అన్న సముద్రానికి చెందిన బుడిగెయ్య పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న బుడిగెయ్య కీమో థెరపీ తీసుకుంటూ కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గోనేవాడు. అతని పరిస్థితి మరీ విషమంగా మారడంతో పవన్ ను కలవాలన్న అతని కోరికను పార్టీ కార్యకర్తలకు తెలియజేయగా వారు ఈ విషయాన్ని పవన్ దృష్టికి తీసుకొచ్చారు. అతని పరిస్థితి గురించి తెలుసుకున్న పవన్ కళ్యాణ్.. మంగళగిరి అతని వైద్యం చేయించుకుంటున్న ఎన్. ఆర్.ఐ ఆసుపత్రి డాక్టర్లతో మాట్లాడుతానని, ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు వాకబు చేస్తానని హామీ ఇచ్చారు.