వైసీపీ అభ్యర్థి కారుపై జనసేన కార్యకర్తల దాడి

వైసీపీ అభ్యర్థి కారుపై జనసేన కార్యకర్తల దాడి

పశ్చిమ గోదావరి జిల్లాలో శనివారం రాత్రి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వైసీపీ నుంచి పోటీ చేస్తున్న నర్సాపురం  లోక్‌సభ అభ్యర్థి కనుమూరి రఘు రామకృష్ణంరాజు కారుపై జనసేన కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. మొగల్తూరు మండలంలోని కాళీపట్నంలో జనసేన పార్టీ మీటింగ్ జరుగుతున్న సమయంలో రఘు రామకృష్ణంరాజు కాన్వాయ్ అటుగా వచ్చింది. దీంతో జనసేన కార్యకర్తలు ఆయన కారుపై రాళ్ళతో దాడి చేశారు. ఈ ఘటనలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడి నుంచి సురక్షితంగా బయటపడిన రఘురామ కృష్ణం రాజు  భీమవరం టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో జరిగిన ఘటన గురించి ఫిర్యాదు చేశారు