జనగామ అర్బన్, వెలుగు : యాసంగి సీజన్ కి సంబంధించి ధాన్యం కొనుగోలు నిర్వహణ ప్రక్రియ సజావుగా జరగాలని జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై వ్యవసాయ, మార్కెట్, రవాణా, గ్రామీణాభివృద్ధి, కో-ఆపరేటివ్ తదితర శాఖల అధికారులతో మంగళవారం అడిషనల్ కలెక్టర్ బెన్ షాలోమ్ తో కలిసి కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కేంద్రాలకు వచ్చే ధాన్యం కొనుగోలు పక్కాగా జరగాలన్నారు. టార్ఫాలిన్లు, గన్నీ సంచులు, వెయింగ్ మెషీన్లు, తదితరాలు పరికరాలు అన్నీ కొనుగోలు కేంద్రాల్లో సరిపడా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్డీవో వసంత, డీఏవో అంబికా సోనీ, డీఎం సీఎస్ హతీరాం, డీటీవో శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
