జనగామ లో..ఏడు మెడికల్ షాపుల లైసెన్స్ సస్సెన్షన్

జనగామ లో..ఏడు మెడికల్ షాపుల లైసెన్స్ సస్సెన్షన్

జనగామ, వెలుగు : డాక్టర్​ ప్రిస్క్రిప్షన్​ లేకుండా 'ఎన్​ఆర్​ఎక్స్​' డ్రగ్స్​​ సేల్స్​ చేసిన ఏడు మెడికల్​ షాపుల లైసెన్స్​లను సస్పెండ్​ చేశారు. ఒక్కో మెడికల్​ షాపు లైసెన్స్​ను రెండు రోజుల నుంచి వారం రోజుల వరకూ సస్పెండ్​ చేశారు. ఇటీవల జనగామ జిల్లాలోని 65 మెడికల్​ షాపుల్లో వినియోగదారుల మాదిరిగా వచ్చిన పీజీ స్టూడెంట్స్​ డాక్టర్​ ప్రిస్క్రిప్షన్​ లేకుండానే మత్తు కలిగించే టాబ్లెట్స్​ కొనుగోలు చేయడానికి ప్రయత్నించారు. 

వీటిల్లో ఏడు మెడికల్​ షాపుల నిర్వాహకులు 'ట్రామాడాల్​' డ్రగ్​తో కూడిన మత్తు కలిగించే టాబ్లెట్స్​ విక్రయించారు. దీంతో ఆయా మెడికల్​ షాపులకు 'డ్రగ్ అండ్ కాస్మోటిక్స్ చట్టం - 1940 అండ్​ రూల్స్ - 1945 ప్రకారం డ్రగ్​ ఇన్​స్పెక్టర్​ బాలకృష్ణ షోకాజ్​ నోటీసులు జారీ చేశారు. ఏడు షాపుల లైసెన్స్​ను సస్పెండ్​ చేస్తున్నట్టు బుధవారం తెలిపారు. జనగామ, రఘునాథపల్లి, లింగాల ఘన్​పూర్​లోని ఆయా షాపులను మూసి వేయించి సీజ్​ చేశారు.