జనగామ అర్బన్, వెలుగు: జనగామ పట్టణంలోని జనావాస ప్రాంతంలో కరన్ లాల్‌కు చెందిన అక్రమ వధశాలపై మున్సిపల్ కమిషనర్ సీహెచ్.రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం మున్సిపల్ అధికారులు దాడి నిర్వహించారు. అక్రమంగా మేకలు, గొర్రెలను వధిస్తున్నట్లు గుర్తించిన అధికారులు రూ.లక్ష జరిమానా విధించారు. అక్కడ ఉన్న మాంసాన్ని సీజ్ చేసి స్వాధీనం చేసుకున్నారు.
జనావాసాల్లో అనుమతి లేకుండా వధశాలలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజారోగ్యానికి హాని కలిగించే కార్యకలాపాలను సహించమని మున్సిపల్ కమిషనర్ హెచ్చరించారు.
