జంగో లింగో దీక్షలు ప్రారంభం

జంగో లింగో దీక్షలు ప్రారంభం

జైనూర్, వెలుగు: పుష్య మాసాన్ని పురస్కరించుకొని ఆదివాసీలు తమ కుల దైవాలైన జంగో లింగోలకు ప్రత్యేక పూజలు ప్రారంభించారు. ఆదివారం జైనూర్ మండలంలోని జంగం గ్రామాల సమీపంలో ఉన్న దీక్షా భూమిలో ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఆదివాసీలు దీక్షలు ప్రారంభించారు.

 జంగో లింగో ఘనసంస్థాన్ పీఠాధిపతి కుమ్ర భగవత్‌‌‌‌ రావు పటేల్, వేద పండితుడు ఆత్రం కిసాన్ మహారాజ్ భక్తులకు మాలలు వేసి, కంకణాలు కట్టించారు. మాజీ ఎంపీ సోయం బాపూరావు హాజరై మాల ధరించి దీక్ష కంకణం కట్టుకున్నారు. తరలివచ్చిన వేలాది మంది భక్తులతో జంగం దీక్షాభూమి కిటకిటలాడింది. దీక్షలు ధరించినవారంతా జై జంగో  జై లింగో పేరిట నెల రోజులపాటు కఠోర నియమాలతో దీక్షలు చేపడుతున్నారు.