జన్నారం: అర్ధరాత్రి మూర్చతో గిలగిల.. వ్యక్తి ప్రాణాలు కాపాడిన పోలీసులు...రూ.1.08 లక్షలు అందజేత

జన్నారం: అర్ధరాత్రి మూర్చతో గిలగిల.. వ్యక్తి ప్రాణాలు కాపాడిన పోలీసులు...రూ.1.08 లక్షలు అందజేత

జన్నారం, వెలుగు: మూర్చ వ్యాధితో అర్ధరాత్రి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వ్యక్తి ప్రాణాలను కాపాడిన పోలీసులు.. అతడికి సంబంధించిన రూ.1.08 లక్షల భద్రంగా అప్పజెప్పి తమ నిబద్ధత చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం లోతొర్రే గ్రామానికి చెందిన గిరిజనుడు కుర్సెంగా దేవరావు పని మీద ఆదివారం రాత్రి  జన్నారం మండల కేంద్రానికి వచ్చి తిరుగు ప్రయాణంలో మూర్చవచ్చి రోడ్డు పక్కన పడిపోయారు. ఆ సమయంలో అటుగా వచ్చిన బ్లూ కోల్ట్ పోలీసులు నోటిలో నురగలతో కిందపడి కొట్టుమిట్టాడుతున్న దేవయ్యను గమనించారు. 

ఎస్సై ఉదయ్ కిరణ్ సూచనల మేరకు వెంటనే ప్రైవేట్ అంబులెన్స్​లో లక్సెట్టిపేట ప్రభుత్వ హాస్పిటల్​కు తరలించారు. అనంతరం దేవయ్య పడిఉన్న ప్రదేశాన్ని పరిశీలించగా ప్లాస్టిక్ కవర్ లో రూ.1.08 లక్షలు గుర్తించి భద్రపరిచారు. సరైన సమయంలో హస్పిటల్ లో చేర్పించి ట్రీట్​మెంట్ అందించడంతో దేవయ్యకు ప్రాణప్రాయం తప్పింది. చికిత్స అనంతరం మంగళవారం జన్నారం పోలీస్ స్టేషన్ వచ్చిన దేవయ్యకు లోతొర్రె సర్పంచ్ బోడ శంకర్ సమక్ష్యంలో ఆయనకు సంబంధించిన రూ.1.08 లక్షలను ఎస్సై ఉదయ్ కిరణ్ అందజేశారు.