వింబుల్డన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ట్రోఫీ దిశగా యానిక్ సినర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

 వింబుల్డన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ట్రోఫీ దిశగా  యానిక్ సినర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

లండన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: ఫ్రెంచ్ ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టైటిల్ కోల్పోయిన వరల్డ్ నంబర్ వన్ యానిక్ సినర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వింబుల్డన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ట్రోఫీ దిశగా ముందుకెళ్తున్నాడు. ఒక్క సెట్ కూడా కోల్పోకుండా మెగా టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు. శనివారం జరిగిన మెన్స్ సింగిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూడో రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సినర్ (ఇటలీ) 6–-1, 6-–3, 6–-1తో  పెడ్రో మార్టినెజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (స్పెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)ను చిత్తుగా ఓడించాడు. దాంతో వరుసగా ఏడో గ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్లామ్ టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అడుగు పెట్టాడు. 

గ్రిగర్ దిమిత్రోవ్ (బల్గేరియా) 6–3, 6–4, 7–6 (7/0)తో ఆఫ్నెర్ (ఆస్ట్రియా)ను ఓడించాడు. విమెన్స్ సింగిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సంచలనాలు కొనసాగుతున్నాయి.  2022 వింబుల్డన్ చాంపియన్ ఎలెనా రిబకినా (కజకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)కు షాక్ తగిలింది. మూడో రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  23వ సీడ్ క్లారా టౌసన్ (డెన్మార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) 7-–6 (8/6), 6–-3 తో అనూహ్యంగా ఓడింది.  18 ఏండ్ల రఫ్యా ప్లేయర్ మిరా ఆండ్రీవా 6–-1, 6–-3తో హేలీ బాప్టిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (అమెరికా)పై  నెగ్గింది. వరల్డ్ నంబర్ వన్ అరీనా సబలెంక (బెలారస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) 7-–6(8/6), 6-–4తో బ్రిటన్ స్టార్ ఎమ్మా రదుకాను ఓడించగా.. ఎనిమిదో సీడ్ ఇగా స్వైటెక్ (పోలాండ్) 6–2, 6– 3 తో కొలిన్స్(అమెరికా)పై నెగ్గి ప్రిక్వార్టర్స్ చేరారు.