మియామి: ఇటలీ స్టార్ ప్లేయర్ యానిక్ సినర్ మియామి ఓపెన్‌లో చరిత్ర సృష్టించాడు. బుధవారం జరిగిన మెన్స్ సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో సినర్ 7–5, 7–6తో అలెక్స్ మిచెల్స్ (అమెరికా)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఈ క్రమంలో ఏటీపీ మాస్టర్స్–1000 టోర్నీల్లో వరుసగా 28 సెట్లు గెలిచిన తొలి ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు. పదేండ్ల కిందట జొకోవిచ్ నెలకొల్పిన 24 సెట్ల రికార్డును బ్రేక్ చేశాడు.
