నెక్స్ట్ లెవెల్‌‌‌‌‌‌‌‌లో జపాన్

నెక్స్ట్ లెవెల్‌‌‌‌‌‌‌‌లో జపాన్

కార్తి హీరోగా రాజు మురుగన్ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించిన చిత్రం ‘జపాన్’. శుక్రవారం  సినిమా విడుదలవుతోన్న సందర్భంగా రాజు మురుగున్ మాట్లాడుతూ ‘కార్తి నాకు మంచి స్నేహితుడు. సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తి. ఆయన్ను కలిసినప్పుడు హ్యూమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కూడిన మంచి కథ రాస్తే  ప్రాజెక్ట్ చేస్తానని హామీ ఇచ్చారు.  అలా ఈ కథ చేయడానికి ఆయనే నన్ను మోటివేట్ చేశారు. ఇదొక యూనిక్ క్యారెక్టర్ బేస్డ్ మూవీ. కథ, కథనాలు చెప్పినప్పుడు, సినిమా టేకింగ్ సమయంలో కార్తి గారు చాలా ప్రశ్నలు అడుగుతారు. 

ఎందుకు ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారో అని మనం కూడా ఆశ్చర్యపోతాం. అతని ప్రశ్నలు మనలో చాలా  కొత్త ఆలోచనలను రేకెత్తిస్తాయి. ఆయనతో  పని చేయడం వండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్ ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియెన్స్. అను ఇమ్మాన్యుయేల్ గ్లామర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఆకట్టుకుంటుంది.  సునీల్ గారు ముఖ్యమైన పాత్రలో కనిపిస్తారు.  ఇలాంటి కథ చెప్పడానికి ఇంటర్నేషనల్ మేకింగ్ కావాలి. దీనికోసం ఇండియా బెస్ట్ కెమెరామెన్‌‌‌‌‌‌‌‌  రవి వర్మన్ గారిని తీసుకున్నాం. తన పనితీరుతో సినిమాకు బెస్ట్ క్వాలిటీ ఇచ్చారు.  

జీవీ ప్రకాష్ మ్యూజిక్ హైలైట్‌‌‌‌‌‌‌‌గా ఉంటుంది. అతను టైట్ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌లో చాలా బిజీగా ఉన్నప్పటికీ ఎంతగానో సహకరించారు. అదే విధంగా, ఎడిటర్ ఫిలోమిన్ రాజ్, ఆర్ట్ డైరెక్టర్ బంగ్లాన్ సహా టెక్నికల్ టీం అంతా  సపోర్ట్ చేశారు.  ‘జపాన్’ చిత్రం ప్రేక్షకులను నెక్స్ట్ లెవల్‌‌‌‌‌‌‌‌కు  తీసుకు వెళుతుందని నమ్ముతున్నా’ అన్నాడు.